تجاوز إلى المحتوى

ఇతర విషయాల విభాగం

21 lessons · Select a question to read the answer

Your progress in this topicTrack completed lessons on this device
Choose how to study:
11: ధర్మాదేశాలకు సంబంధించిన ఐదు నియమాలు ఏమిటి?

జవాబు:

1 - అల్ వాజిబ్ (తప్పనిసరి, విధి)

2 - అల్ ముస్తహబ్ (చేస్తే మంచిది)

3 - అల్ ముహర్రమ్ (నిషేధించబడింది)

4 - అల్ మక్రూహ్ (చేయకపోతే మంచిది)

5 - అల్ ముబాహ్ (చేస్తే పాపమూ కాదు, పుణ్యమూ కాదు)

Open lesson
22: ఈ ఐదు నియమాల గురించి వివరించండి?

జవాబు:

1 - అల్ వాజిబు: ఉదాహరణకు ఐదుపూటల సలాహ్ (నమాజులు), రమదాన్ మాసంలో నెల మొత్తం పాటించ వలసిన ఉపవాసాలు మరియు తల్లిదండ్రుల పట్ల విధేయత వంటివి.

- వాజిబ్ ఆచరణలు విధిగా అమలు చేసినందుకు ప్రతిఫలం లభిస్తుంది, కానీ వాటిని విడిచిపెడితే శిక్షలు ఉంటాయి.

2 - అల్ ముస్తహబ్: సాధారణ సున్నత్ సలాహ్ లు (నమాజులు), రాత్రి నమాజులు, ప్రజలకు భోజనం పెట్టడం మరియు శాంతి శుభాకాంక్షలు అభిలషిస్తూ సలాం చేయడం వంటివి. దీనిని "సున్నత్" మరియు "మందూబ్" అని కూడా అంటారు.

- ముస్తహబ్ ఆచరణలు చేస్తే ప్రతిఫలం ఉంటుంది మరియు చేయకపోతే శిక్ష ఉండదు.

ముఖ్య గమనిక:

ముస్లింలు సున్నత్ లేదా ముస్తహబ్ ఆచరణలు చేసేందుకు త్వరపడాలి మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఉదాహరణలను అనుసరించాలి.

3 - అల్ ముహర్రమ్: ఉదాహరణకు మద్యం సేవించడం, తల్లిదండ్రుల పట్ల అనుచితంగా ఉండటం మరియు బంధుత్వ సంబంధాలను తెంచుకోవడం వంటివి.

- నిషేధించబడిన వాటిని విడిచిపెట్టినందుకు పుణ్యాలు ప్రసాదించ బడతాయి, కానీ వాటికి పాల్పడితే శిక్షలు ఉంటాయి.

4 - అల్ మక్రూహ్: ఎడమ చేతితో తీసుకోవడం మరియు ఇవ్వడం మరియు నమాజులో వస్త్రం యొక్క దిగువ భాగాన్ని పైకి ఎత్తడం వంటివి.

- మక్రూహ్ పనులు (అయిష్టకరమైనవి) త్యజించినందుకు ప్రతిఫలం లభిస్తుంది. ఒకవేళ వాటిని చేస్తే దానివలన శిక్షలు ఉండవు.

5 - అల్ ముబాహ్: ఆపిల్ తినడం మరియు టీ తాగడం వంటివి. దీనిని "జాయజ్" మరియు "హలాల్" అని కూడా అంటారు.

- అనుమతించబడిన వాటిని విడిచిపెట్టినందుకు ప్రతిఫలం ఉండదు, అది చేయడం వలన శిక్షలూ ఉండవు.

Open lesson
33: అమ్మకాలు మరియు లావాదేవీలపై ధార్మిక ఆదేశం ఏమిటి?

జవాబు: సూత్రప్రాయంగా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిషేధించిన కొన్ని తప్ప, అన్ని రకాల అమ్మకాలు మరియు లావాదేవీలు అనుమతించబడినాయి.

మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: మరియు వ్యాపారాన్ని (కొనుగోళ్ళు, అమ్మకాలను) ధర్మబద్ధం చేసినాడు మరియు వడ్డీలను నిషేధించినాడు. [సూరతుల్ బఖరహ్: 275వ ఆయతు]

Open lesson
44: నిషేధించబడిన కొన్ని అమ్మకాలు, లావాదేవీలు ఏమిటి?

జవాబు:

1 - మోసం: వస్తువులో లోపాన్ని దాచడం వంటివి.

అబీ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకసారి (బజారులోని) ధాన్యపు కుప్ప వద్దకు వచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తన చేతిని అందులో జొప్పించి చూడగా, ఆయన చేతివేళ్లకు కొంత తేమ తగిలింది. అది చూసి ఆయన (అతనితో ఇలా అడిగారు: "ఓ ధాన్యపు కుప్ప యజమానీ, ఏమిటిది?" దానికి ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు: "ఓ రసూలుల్లాహ్, వర్షం పడింది (ధాన్యం వర్షంలో తడిసింది)" అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: "ప్రజలు చూసేలా నీవు ధాన్యం గుట్టపై భాగాన ఈ తడిసిన ధాన్యాన్ని ఎందుకు ఉంచలేదు? మోసం చేసేవాడికీ నాకూ ఎలాంటి సంబంధమూ లేదు." ముస్లిం హదీసు గ్రంధము

2 -రిబా (వడ్డీ): ఒకరి నుండి వెయ్యి అప్పుగా తీసుకుని, రెండు వేలు తిరిగి ఇవ్వడం.

ఈ అదనపు ధనం నిషేధిత వడ్డీగా పరిగణించబడుతుంది.

మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: మరియు వ్యాపారాన్ని ధర్మబద్ధం చేసాడు మరియు వడ్డీలను నిషేధించినాడు. [సూరతుల్ బఖరహ్: 275వ ఆయతు]

3 - ఘరర్ (అనిశ్చితి, అపాయము) మరియు జహాలహ్ (అజ్ఞానం): ఆడ గొర్రె పొదుగులో ఉన్న పాలను అమ్మడం లేదా ఇంకా పట్టుకోని చేపలను అమ్మడం వంటివి అంటే తన ఆధీనంలో లేని దానిని అమ్మడం అన్నమాట.

హదీస్ లో ఇలా పేర్కొనబడింది: "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఘరార్ (అనిశ్చితి, అపాయం) లావాదేవీలను నిషేధించారు". ముస్లిం హదీసు గ్రంధము

Open lesson
55: అల్లాహ్ మీకు ప్రసాదించిన కొన్ని అనుగ్రహాలను పేర్కొనండి?

జవాబు: 1 - అవిశ్వాసిగా కాకుండా ముస్లింగా ఉండటమనే గొప్ప అనుగ్రహం

2 - మతోన్మాద ఆవిష్కర్తలను అనుసరించే వారిలో కాకుండా సున్నత్కు కట్టుబడి ఉండటం.

3 - చక్కగా వినడం, చూడడం, నడవడం మొదలైన వాటితో సహా మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క అనుగ్రహాలు.

4 - ఆహారం, పానీయం మరియు బట్టలు కలిగి ఉన్న అనుగ్రహం

వాస్తవానికి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మనకు ప్రసాదించిన అనుగ్రహాలు ఎన్నో ఉన్నాయి మరియు వాటన్నింటినీ మనం లెక్కించలేము మరియు పేర్కొనలేము.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : మరియు మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్క పెట్టదలచినా, మీరు వాటిని లెక్క పెట్టలేరు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. [సూరతున్నహల్ : 18వ ఆయతు]

Open lesson
66: మనకు ప్రసాదించబడిన అనుగ్రహాల పట్ల మన కర్తవ్యం ఏమిటి? మనం వాటికి బదులుగా ఎలా కృతజ్ఞత తెలుపుకోవలెను?

జవాబు: అల్లాహ్ను మన నాలుకతో స్తుతించడం ద్వారా మరియు అన్ని ఉపకారాలను ఆయనకే ఆపాదించడం ద్వారా అటువంటి అనుగ్రహాలు కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేయడం మన విధి.

Open lesson
77: ముస్లింల పండుగలు ఏవి?

జవాబు: ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అద్'హా

అనస్ రజియల్లాహు అన్హు యొక్క హదీసులో ఇలా పేర్కొనబడింది: "రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనాకు (వలస) వచ్చినప్పుడు, ప్రజలు రెండు రోజులు ఆటపాటలలో గడపడం చూసి, ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అడిగారు: 'ఏమిటి ఈ రెండు రోజులు?' దానికి వారు ఇలా బదులు పలికారు: 'మేము ఇస్లామ్ కు పూర్వ కాలంలో ఈ రెండు దినాలలో ఆటపాటలలో గడిపేవాళ్ళం.' అప్పుడు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: 'అల్లాహ్ మీకు ఈ రెండింటి కంటే మెరుగైన వాటిని ఇచ్చాడు: ఒకటి ఖుర్బానీ చేసే దినం (ఈద్ అల్-అద్హా) మరియు ఉపవాసాలు విరమించే దినం (ఈద్ అల్ - ఫితర్). అబూ దావూద్ హదీసు గ్రంధము

ఈ రెండు ఈద్ పండుగలు కాకుండా మిగిలిన అన్ని పండుగలు మతపరమైన ఆవిష్కరణలుగా, నూతన కల్పితాలుగా పరిగణించబడతాయి.

Open lesson
88: మాసములలో ఏ మాసము ఉత్తమమైనది?

జవాబు: రమదాను మాసం

Open lesson
99: వారం రోజులలో ఏ రోజు ఉత్తమమైనది?

జవాబు: జుమఅహ్ రోజు

Open lesson
1010: మొత్తం సంవత్సరంలోని దినములలో ఏ దినము ఉత్తమమైనది?

జవాబు: అరఫహ్ దినము

Open lesson
1111: మొత్తం సంవత్సరములోని రాత్రులలో ఏ రాత్రి ఉత్తమమైనది?

జవాబు: లైలతుల్ ఖదర్ రాత్రి

Open lesson
1212: మహ్రం కాని స్త్రీని చూసినప్పుడు ఏమి చేయాలి?

జవాబు: తప్పనిసరిగా తన చూపును క్రిందికి దించుకో వలెను. మహోన్నతుడైన అల్లాహ్ ఆదేశం: విశ్వసించిన పురుషులతో, వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. [సూరతున్నూర్: 30వ ఆయతు]

Open lesson
1313: మానవుడి శత్రువులు ఎవరు?

1 - ఒకరిని చెడు వైపుకు ప్రేరేపించే మానవ ఆత్మ: ఇది ఒక వ్యక్తి తన ఆత్మ తనకు ఏది నిర్దేశిస్తుందో దానిని అనుసరించి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్కు అవిధేయత చూపడంలో అతని వ్యక్తిగత కోరికలను అనుసరించేలా చేసే ఆత్మ. పరమ పరిశుద్ధుడైన అల్లాహ్ ప్రకటన: వాస్తవానికి మానవ ఆత్మ చెడు (పాపం) చేయటానికి పురికొల్పుతూ ఉంటుంది – నా ప్రభువు కరుణించిన వాడు తప్ప – నిశ్చయంగా, నా ప్రభువు క్షమాశీలుడు, అపార కరుణాప్రధాత. [సూరతు యూసుఫ్ :53వ ఆయతు] 2 - షైతాను: అతడి ప్రధాన లక్ష్యం - మనిషిని తప్పుదారి పట్టించడం, అతనిని చెడు వైపు ప్రేరేపించడం మరియు నరకాగ్నిలోకి తీసుకెళ్లడం. షై’తాన్ అడుగుజాడలను అనుసరించకండి. నిశ్చయంగా అతడు మీకు బహిరంగ శత్రువు. [సూరతుల్ బఖరహ్: 168వ ఆయతు] 3 - చెడ్డ సహవాసులు: వారు చెడు వైపు ఒకరిని పురికొల్పేవారు మరియు మంచితనం నుండి అతన్ని నిరోధించేవారు. ఆ దినమున దైవభీతి గలవారు తప్ప ఇతర స్నేహితులంతా ఒకరి కొరకు శత్రువులవుతారు. [సూరతుల్ జుఖ్'రుఫ్: 67వ ఆయతు]

Open lesson
1414: తౌబహ్ (పశ్చాత్తాపం) అంటే ఏమిటి?

జవాబు: అత్తౌబహ్: పశ్చాత్తాపం అంటే పాపాలను విడిచిపెట్టి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్కు విధేయత చూపడం. అయితే, ఎవడైతే పశ్చాత్తాపపడి విశ్వసించి మరియు సత్కార్యాలు చేసి సన్మార్గంలో నడుస్తాడో, అలాంటి వాని పట్ల నేను క్షమాశీలుడను. [సూరతు తాహా : 82వ ఆయతు]

Open lesson
1515: అత్తౌబహ్ (పశ్చాత్తాపం) యొక్క షరతులు ఏమిటి?

జవాబు: 1 - చెడుపనులు, పాపకార్యాలు విడిచి పెట్టడం

2 - చేసిన చెడుపనికి, పాపకార్యానికి పశ్చాత్తాపం చెందటం

3 - మరలా ఆ చెడుపనులు, పాపకార్యాలను చేయనని దృఢనిశ్చయం చేసుకోవడం

4 - ఒకవేళ ఆ చెడుపనిలో, పాపకార్యంలో ఇతరుల హక్కులు ఉల్లంఘించి ఉంటే వాటిని వాపసు చేయడం (దొంగిలించి ఉంటే దానిని అసలు యజమానికి వాపసు చేయడం).

మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: మరియు వారు, ఎవరైతే అశ్లీల పనులు చేసినా లేదా తమకు తాము అన్యాయం చేసుకున్నా, అల్లాహ్ ను స్మరించి తమ పాపాలకు క్షమాపణ వేడుకుంటారో! మరియు అల్లాహ్ తప్ప, పాపాలను క్షమించ గలవారు ఇతరులు ఎవరున్నారు? మరియు వారు తాము చేసిన తప్పులను బుద్ధిపూర్వకంగా మూర్ఖపు పట్టుతో మళ్ళీ చేయరు! సూరతు ఆలే ఇమ్రాన్ : 135 ఆయతు.

Open lesson
1616: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పంపడం అంటే ఏమిటి?

జవాబు: అంతిమదినంనాడు జరిగే అత్యున్నత సమావేశంలో తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం)ప్రస్తావనను గొప్పగా ప్రస్తావించమని అల్లాహ్ ను వేడుకోవడం.

Open lesson
1717: సుబహానల్లాహ్ అంటే అర్థం ఏమిటి?

జవాబు: ఇది ఒక తస్బీహ్ పదం అంటే అల్లాహ్ యొక్క ధ్యానం చేసే పదం. దీని అర్థం ఎలాంటి లోపములకూ, కొరతలకూ అతీతుడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అని ప్రశంసించడం.

Open lesson
1818: అల్'హమ్'దు లిల్లాహ్ అంటే అర్థం ఏమిటి?

జవాబు: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను స్తుతించడం మరియు పరిపూర్ణత యొక్క అన్ని లక్షణాలతో ఆయనను ప్రశంసించడం, ఆయనకు కృతజ్ఞతలు తెలుపు కోవడం.

Open lesson
1919: అల్లాహు అక్బర్ అంటే అర్థం ఏమిటి?

జవాబు: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అన్నిటికంటే, అందరి కంటే గొప్పవాడు మరియు అత్యంత శక్తిమంతుడు అని దీని అర్థం.

Open lesson
2020: లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అంటే అర్థం ఏమిటి?

జవాబు: అల్లాహ్ యొక్క బలం మరియు శక్తి ద్వారా తప్ప స్వయంగా ఒక వ్యక్తి ఒక స్థితి నుండి మరొక స్థితికి మారలేడు.

Open lesson
2121: అస్తగ్'ఫిరుల్లాహ్ అంటే అర్థం ఏమిటి?

జవాబు: ఒకరి పాపాలను తుడిచివేయమని మరియు లోపాలను కప్పిపుచ్చమని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను కోరడం.

Open lesson